పాక్ బలూచిస్థాన్‌లో ఓ హిందూ వ్యాపారి హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుడు రాకేశ్ కుమార్‌గా గుర్తించారు. నోష్కి పట్టణంలో రాకేశ్ కుమార్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన దుకాణంలోకి కొంతమంది గుర్తుతెలియని సాయుధులు కాల్పులు జరిపడంతో అతను మరణించాడు.
వార్తలు
బలూచిస్థాన్‌లో హిందూ వ్యాపారి హత్య


