70 కోట్ల మంది మహిళలే తన బలం అని పూణె కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మహిళలే దేశానికి అతి పెద్ద సంపద అని, వారిని కుటుంబ పాత్రలకే పరిమితం చేయకూడదని చెప్పారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువ సున్నితత్వం, సౌమ్యత, కరుణ, దూరదృష్టి కలిగి ఉంటారని కొనియాడారు. అందుకే మహిళలు, యువతులు, వృద్ధులు అనే తేడా లేకుండా దేశానికి అతి పెద్ద సంపద అని తాను నమ్ముతానని తెలిపారు.
వార్తలు
70 కోట్ల మంది మహిళలే నా బలం: రాహుల్


