హైదరాబాద్: 28°C
వార్తలు

సత్తుపల్లిలో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు

KMM: సత్తుపల్లిలో ఏఐటీయూసీ 17వ జిల్లా మహాసభలు రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు. సభా ప్రాంగణం వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించి, లేబర్‌ కోడ్ల ప్రభావంపై సదస్సు చేపట్టనున్నారు. సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొంటారు.