హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు జగిత్యాల టౌన్-3 పరిధిలో విద్యుత్ కోత

JGL: జగిత్యాల పట్టణంలోని 11కేవీ వాణినగర్ ఫీడర్‌లో అత్యవసర మరమ్మతుల దృష్ట్యా రేపు ఆదివారం ఉ.9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ కె.గంగారం తెలిపారు. టౌన్-3 పరిధిలోని వాణినగర్, బీట్, నటరాజ్ చౌరస్తాలు, కొత్త బస్టాండు ఔట్ గేట్, తులసినగర్, గీత విద్యాలయం, ఎల్.ఎల్.గార్డెన్ ఏరియాల్లో కరెంట్ కోత ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.