హైదరాబాద్: 28°C
వార్తలు

రాజీనామాను మరోసారి పంపిన పూనావాలా

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా పార్టీకి రాజీనామా చేశారు. ఆర్థిక, వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 'X'లో వెల్లడించారు. జులై 30న ఆయన ఇచ్చిన రాజీనామాను పునఃపరిశీలించాలని పార్టీ కోరగా.. తాజాగా బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌కు మరోసారి తన రాజీనామా లేఖను పంపారు. తాను ప్రైవేట్ రంగంలోకి వెళ్తున్నా.. మోదీకి, బీజేపీకి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.