నల్సార్ విద్యార్థుల వివాదంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా బేషరుతుగా క్షమాపణలు తెలిపారు. విద్యార్థుల స్వతంత్ర ఆలోచనా విధానాన్ని గౌరవిస్తామని పేర్కొన్నారు. స్నాతకోత్సవంలో నిరసన తెలిపిన విద్యార్థుల నమోదుపై గతంలో జారీ చేసిన నిషేధ ఆదేశాలను బీసీఐ వెనక్కి తీసుకుంది. దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో ఈ వివాదానికి తెరదించింది.
వార్తలు
విద్యార్థులకు బార్ కౌన్సిల్ చీఫ్ క్షమాపణలు


