హైదరాబాద్: 28°C
వార్తలు

భావోద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం

TG: వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భావోద్వేగానికి గురయ్యారు. పుట్టుకతో వినికిడి లోపం ఉన్న లక్ష్మీమనీష్‌కు రూ. 6 లక్షల విలువైన ఇయర్ రింగ్ మిషన్‌ను ఆయన అందజేశారు. తనకు ప్రాణం పోసిన భట్టికి కృతజ్ఞతగా బాలుడు తన స్వయంగా వేసిన ఆయన చిత్రాన్ని బహుమతిగా ఇవ్వడంతో, చలించిపోయిన డిప్యూటీ సీఎం బాలుడిని గుండెలకు హత్తుకున్నారు.