హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు'

TGలో అర్హులైన పేదలకు సన్నబియ్యంతో పాటు క్యూఆర్ కోడ్ భద్రత కలిగిన ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డులను పారదర్శకంగా అందిస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇతర అధికారులతో కలిసి ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.