స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రూ.5 వేల నగదును ప్రోత్సాహకంగా అందిస్తున్నారని SMలో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం బ్యాంకు వివరాలు తెలపాలంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆ ప్రచారంలో నిజం లేదని తెలిపింది. అలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని కోరింది. అనుమానిత లింక్‌లను క్లిక్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
వార్తలు
రూ.5 వేల నగదు ప్రోత్సాహం.. నిజమెంత?


