హైదరాబాద్: 28°C
వార్తలు

రిజర్వాయర్ సామర్థ్యం పెంపు: జితేందర్ రెడ్డి

GDWL: గద్వాల పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడారు. గూడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు, గట్టు ప్రాజెక్టును రూ.1,781 కోట్లతో 3 టీఎంసీలకు పెంచేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రూ.376.25 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్లు, రూ.339.39 కోట్లతో రోడ్ల పనులు చేపడుతున్నట్లు తెలిపారు.