హైదరాబాద్: 28°C
వార్తలు

బెల్ట్ షాపులకు నేడు ‘ఫ్రీడం’..?

HNK: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వైన్స్‌ షాపులు మూసివేయడంతో హసన్‌పర్తి, మడికొండ పరిధిలో బెల్ట్‌షాపులు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. రాంపూర్, గుండ్లసింగారం, పెగడపల్లి, గణేష్‌నగర్, ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలోనూ యథేచ్ఛగా అమ్మకాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.