హైదరాబాద్: 28°C
వార్తలు

చీఫ్ విప్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

PLD: వినుకొండ లోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. మహనీయుల త్యాగాల వల్లనే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులకు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.