WGL: భద్రకాళి ఆలయం పంద్రాగస్టు సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి అర్చకులు విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, అర్చనలు నిర్వహించారు. ఆలయం మొత్తం అమ్మవారి నామస్మరణలతో మార్మోగింది.
వార్తలు
భద్రకాళి ఆలయానికి భక్తుల తాకిడి


