హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా ముత్తయ్య'

NLG: ఎమ్మార్పీఎస్ నార్కట్‌పల్లి మండల అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన లింగాల ముత్తయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మార్పీఎస్ నాయకులు చిరుమర్తి యాదయ్య, మేడి శంకర్, ఎరసాని గోపాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని పేర్కొన్నారు.