హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను తెలుసుకోవాలి'

కృష్ణా: నందివాడ మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మండల టీడీపీ అధ్యక్షుడు సన్యాసిరావు జాతీయ జెండాను ఎగరవేశారు. దేశానికి స్వాతంత్రం ఒక్కరోజులో రాలేదని, ఎందరో మహానీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా నేటి స్వేచ్ఛ ఆవిర్భవించిందని ఆయన అన్నారు. స్వాతంత్ర సమరయోధుల కష్టాలు, త్యాగాలను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు.