హైదరాబాద్: 28°C
వార్తలు

11 నెలల కుమార్తెను నదిలో విసిరిన తండ్రి

యూపీ ఆగ్రా సమీపంలోని సికంద్రాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 17న కుమార్తె బర్త్ డే ఉండటంతో.. బట్టలు కొనేందుకు బైక్‌పై పాపతో ఆగ్రాకు దంపతులు బయలుదేరారు. మార్గమధ్యలో అక్బారా వంతెన వద్ద భర్త బైకును ఆపాడు. తర్వాత సెల్ఫీ పేరుతో 11నెలల పాపను తండ్రి నదిలో పడేశాడు. అనంతరం భార్యను కూడా తోసేస్తుండగా.. ఆమె అరవడంతో స్థానికులు వచ్చి భర్తకు దేహశుద్ధి చేసిన పోలీసులకు అప్పగించారు.