హైదరాబాద్: 28°C
వార్తలు

పాలకులకు దేశంపై అవగాహన లేదు: కేటీఆర్

TG: తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. దేశ పరిస్థితులు చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. పాలకులకు దేశంపై సరైన అవగాహన లేదని విమర్శించారు. మతం మత్తులో పడి దేశం వెనక్కి వెళ్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధిపై సీఎం ఆలోచన ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.