హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

NTR: వీర్లపాడు మండలం నందలూరుకి చెందిన ఏలూరు నాగేశ్వరరావుకు రూ. 84,517 సీఎంఆర్‌ఎఫ్ చెక్కు మంజూరు అయింది. దీనిని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన కార్యాలయంలో అందజేశారు. ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందనే భరోసా కల్పించారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఈ సహాయం కొంత ఆర్థిక ఊరట కల్పిస్తుందని తెలిపారు. ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.