హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖ జిల్లా కోర్టులో ఘనంగా 'వనం-మనం'

VSP: జాతీయ మానవ హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 15 వరకు నిర్వహించిన ‘వనం-మనం’ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ శనివారం విజయవంతంగా ముగిసింది. విశాఖ జిల్లా కోర్టులో ప్రధాన జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన సూచించారు.