హైదరాబాద్: 28°C
వార్తలు

పూర్వీకుల 90 ఏళ్ల త్యాగఫలమే స్వాతంత్య్రం: RSS

స్వాతంత్య్ర దినోత్సవం మనందరికీ ఎంతో గర్వకారణమని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నుంచి 90 ఏళ్ల పాటు మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేసి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టారని తెలిపారు. వారి అపూర్వ త్యాగాలను మన హృదయాల్లో ఎప్పుడూ స్మరిస్తూ గర్వంగా ఉండాలన్నారు. దేశాన్ని సమగ్ర ప్రగతిపథంలో నడిపించాల్సిన బాధ్యత పౌరులదేనని చెప్పారు.