కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో వేంచేసి ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. స్వామివారి ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమించారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులకు అన్నప్రసాద ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వార్తలు
ప్రత్యేక పుష్పాలంకరణలో 'పెళ్లిళ్ల వెంకన్న'


