భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శుభాకాంక్షలు తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయన్నారు. దీనికి అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఉన్న స్నేహమే కారణమని వెల్లడించారు. రక్షణ, ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాల సహకారం మరింత విస్తరిస్తోందని తెలిపారు.
వార్తలు
భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం: రూబియో


