హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళపై వేటకొడవలితో దాడి..!

అన్నమయ్య: మదనపల్లె మండలం బొమ్మనచెరువు గ్రామంలో మహిళపై వేటకొడవలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన రాజేష్‌ను మదనపల్లె తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. మహిళలపై వేధింపులు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు.