హైదరాబాద్: 28°C
వార్తలు

'సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం'

ASR: చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ఏడీఆర్ డా.ఆదిలక్ష్మి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలోని ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, అనుకూలమైన పంటలు, వాటి అభివృద్ధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.