హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతిపక్షాలకు మోదీ కీలక పిలుపు

80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా ప్రతిపక్షపార్టీలకు ప్రధాని మోదీ కీలక పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు దేశంలోని అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోటా అందాలని చెప్పారు. దేశాభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని తెలిపారు. పథకాల రూపకల్పనకు జనగణన సమాచారం కీలకమన్నారు. జనగణనకు యువత సహకరించాలని అభ్యర్థించారు.