నెల్లూరు: కలెక్టరేట్‌లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 100 అడుగుల స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చిన్నారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, భారత్ మాతాకీ జై నినాదాలతో విద్యార్థుల్లో దేశభక్తిని నింపారు.
వార్తలు
కలెక్టరేట్‌లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు


