హైదరాబాద్: 28°C
వార్తలు

నర్సీపట్నంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

AKP: నర్సీపట్నంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో వివి రమణ, తహసిల్దార్ ఆఫీస్‌లో ఎమ్మార్వో లోకవరపు రామారావు జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ప్రగతి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. మండల ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.