హైదరాబాద్: 28°C
వార్తలు

త్రివర్ణ శోభితంగా వాసవి మాత..!

W.G: పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాంతిధామంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాసవి అమ్మవారు భక్తులకు భారతమాత రూపంలో దర్శనమిచ్చారు. పండితులు అమ్మవారిని త్రివర్ణ పతాక రంగుల వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.