హైదరాబాద్: 28°C
వార్తలు

సింగూరుకు కొనసాగుతున్న ఇన్​ఫ్లో

MDK: ఉమ్మడి జిల్లాలోని కీలక ప్రాజెక్టైన సింగూరు జలాశయానికి స్వల్పంగా ఇన్​ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుతం గరిష్ఠ నీటిమట్టం 523.600 మీటర్లకు గాను శనివారానికి 515.305 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు 29.917 TMCల పూర్తి సామర్థ్యానికి ప్రస్తుతం 4.356 TMCల నీరుంది. జలాశయంలోకి 692 క్యూసెక్కుల నీరు వస్తుండగా, దిగువకు 380 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.