హైదరాబాద్: 28°C
వార్తలు

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

TG: ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పండుగ దేశంలోని ప్రతి పౌరుడి జీవితంలో నూతన ఉత్సాహం, చైతన్యం నింపి అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాణానికి కొత్త ఊపునివ్వాలని అభిలషించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభసందర్భంగా నవ భారత నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.