MBNR: పోలేపల్లి గ్రామంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం ‘డ్రై డే’ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. పాఠశాలల్లో విద్యాబోధన, మౌలిక వసతులను పరిశీలించి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ నిల్వ నీరు లేకుండా చూడాలని అధికారులకు, గ్రామస్తులకు సూచించారు.
వార్తలు
పోలేపల్లిలో అదనపు కలెక్టర్ పర్యటన


