హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రమాదకరంగా మారిన గజ్వేల్ ప్రధాన రహదారి..!

MDK: చేగుంట నుండి గజ్వేల్ వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు పడటంతో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర నరకం చూస్తున్నారు. రాత్రి వేళల్లో రాకపోకలు సాగించాలంటే భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని విన్న విస్తున్నారు.