హైదరాబాద్: 28°C
వార్తలు

ఎందరో వీరుల బలిదానమే స్వాతంత్య్రం: మోదీ

దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంలో మార్మోగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని తెలిపారు. తొలిసారి ఎర్రకోట వద్ద వందేమాతరం ఆలపించినట్లు చెప్పారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్య్రం అని వెల్లడించారు. స్వాతంత్య్ర సాధన లక్ష్యం కోసం వారంతా తమ జీవితాన్నే త్యాగం చేశారని కొనియాడారు.