హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు సహస్ర ఘటాభిషేకం

BPT: అమృతలూరు, గోవాడ శైవక్షేత్రంలో ఈ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో విఠల్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ.. శ్రీబాలకోటేశ్వరస్వామికి సహస్ర ఘటాభిషేకం, వరుణ జపం, వరుణ హోమం తదితర పూజలు జరుపుతామని తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.