హైదరాబాద్: 28°C
వార్తలు

పూడికతీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

W.G: నరసాపురం ప్రధాన కాలువలో బొమ్మిడి నాయకర్ కాటన్ పార్క్ సమీపంలో పూడికతీత పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించారు. కాలువలో నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తిచేయాలని సూచించారు.