హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యక్తిపై దాడి నలుగురిపై కేసు నమోదు

W.G: నరసాపురం మండలం కొత్త నవరసాపురంలో పశువులు కాస్తున్న వ్యక్తిపై నలుగురు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9న ఓఎన్జీసీ పుంత వద్ద భూపతి నాగేంద్రకుమార్పై దుర్గారావు, అతని భార్య, ఇద్దరు కుమారులు దాడి చేశారు. దుర్గారావు పిడికిలితో ముక్కుపై బలంగా గుద్దడంతో తీవ్ర గాయమై ఎముక విరిగింది. బాధితుడి ఫిర్యాదుతో రూరల్ ఎస్ఐ సతీశ్ కేసు నమోదు చేశారు.