హైదరాబాద్: 28°C
వార్తలు

బుర్జ్ ఖలీఫాపై మెరిసిన మువ్వన్నెల జెండా

దుబాయ్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశానికి UAE అరుదైన గౌరవం అర్పించింది. మువ్వన్నెల కాంతులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫా మెరిసిపోయింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాక వర్ణాల్లో దుబాయ్ నగరం వెలిగిపోయింది. భారత్-యుఏఈల మధ్య బలమైన మైత్రి, సోదరభావానికి చిహ్నంగా దుబాయ్ వేడుకలను నిర్వహించింది.