హైదరాబాద్: 28°C
వార్తలు

ఓపెన్‌ స్కూల్‌లో అడ్మిషన్లకు గడువు పొడిగింపు

SRD: ఓపెన్‌ స్కూల్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ప్రవేశాలకు గడువు శనివారంతో ముగుస్తున్న క్రమంలో ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.