హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళంలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయం రేపు తెరుచుకోనుంది. చింగం మాస పూజల నిమిత్తం ఆలయాన్ని తెరుస్తున్నట్లు దేవస్థానం బోర్డు వెల్లడించింది. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కలిపించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. రేపు సా. 5 గంటలకు ఆలయాన్ని గుడి ప్రధాన పూజారి ప్రసాద్ తెరవనున్నారు. ఈనెల 17న ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.