పంద్రాగస్టు సందర్భంగా ఢిల్లీలో పటిష్ట బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ 1000 సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో పహారాను నిర్వహిస్తున్నారు. అనుమానితులు, నేరగాళ్ల కదలికల దృష్ట్యా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోటలో కార్యక్రమానికి వీఐపీలు సహా 25 వేల మంది హాజరవుతారని అంచనా. ఈ క్రమంలో ఎర్రకోటకు వచ్చే అన్ని మార్గాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
వార్తలు
పంద్రాగస్టు.. పటిష్ట బందోబస్తు


