హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు చీరాలలో ఎమ్మెల్యే కార్యక్రమాలు

BPT: చీరాల ఎమ్మెల్యే యం.యం. కొండయ్య శనివారం పలు అభివృద్ధి, వేడుకల కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం జెండా ఆవిష్కరణలు, హాస్పిటల్‌లో నూతన పరికరాల ప్రారంభంలో పాల్గొంటారు. అనంతరం బాపట్లలో వేడుకలు, చీరాలలో తోపుడుబండ్ల పంపిణీ, రూ.23 కోట్ల అమృత్ పథకం ట్యాంక్ శంకుస్థాపన, ట్రాన్స్‌ఫార్మర్, మంచినీటి కుళాయిల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారని ఆయన కార్యాలయం తెలిపింది.