MHBD: నర్సింహులపేట మండలం జగ్గూతండా పరిధిలోని చింతల్ తండాలో అక్రమ నాటుసారా స్థావరాలపై ఎస్సై బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, 700 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అక్రమంగా నాటుసారా తయారీ, విక్రయానికి పాల్పడుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.
వార్తలు
నాటుసారా కేంద్రంపై పోలీసుల ఉక్కుపాదం


