హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా ఎస్సైను కొట్టిన ఎమ్మెల్యే కూతురు

మహిళా ఎస్సైను చెంపపై బీజేపీ ఎమ్మెల్యే కూతురు కొట్టిన ఘటన కర్ణాటకలో జరిగింది. భీమన అమావాస్య పండగ సందర్భంగా ఆరతి ఉక్కడ అహల్యాదేవి ఆలయానికి భారీగా భక్తులు పొటెత్తారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య నేరుగా గర్భగుడిలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఎస్సై అడ్డుకోగా తాను ఎమ్మెల్యే కూతురిని అంటూ ఐశ్వర్య ఆమెపై దాడి చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.