హైదరాబాద్: 28°C
వార్తలు

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు అరెస్ట్

SS: అగళి మండలం నందరాజనపల్లిలో నకిలీ రూ.500 నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరిని ఎస్సై రంగడు యాదవ్ శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 51 నకిలీ రూ.500 నోట్లు, కొంత నగదు, బైక్, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. నిందితులపై కేసు నమోదు చేసి, కర్ణాటక రాష్ట్రానికి  చెందిన వారిగా గుర్తించారు.