ASR: చింతపల్లి ఏకలవ్య స్కూల్ జూనియర్ అసిస్టెంట్ సుమిత్ తనను చెంప మీద కొట్టాడని ఏఎన్‌ఎం సుజాత ఆరోపించారు. తనతో పాటు 16మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాఠశాలలో మూడేళ్లుగా పనిచేస్తున్నారని సుజాత తెలిపారు. అయితే తమకు 3 నెలలుగా జీతాలు లేవన్నారు. బిల్లులు పెట్టాలని సుమిత్ ను కోరగా, తమపై దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వార్తలు
ఏఎన్‌ఎంపై దాడి చేసిన జూనియర్ అసిస్టెంట్!


