హైదరాబాద్: 28°C
వార్తలు

'సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి'

ATP: జిల్లాలో కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సాగు నీరు, పశుగ్రాసం దొరకక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ముగ్గురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కరువుపై సమీక్షలు కూడా చేయకపోవడం విచారకరమన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.