హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న గౌరు జనార్దన్

KRNL: కల్లూరు అర్బన్ 36వ వార్డు రాధానగర్‌లో ‘2 ఏళ్ల అభివృద్ధి–సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాణ్యం టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మరోవైపు, వర్షం కురుస్తున్నా ప్రజల స్పందనతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగింది.