హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించిన కాశ్మీర్ సీఎం

పాకిస్తాన్‌తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సమర్ధించారు. పాక్ వైఖరి వల్ల తమ రాష్ట్రం దశాబ్దాలుగా నష్టపోయిందని మండిపడ్డారు. ఈ నీళ్లు, నదులు తమవేనని, వాటిని వాడుకునే పూర్తి హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.