AP: మంత్రి కొల్లు రవీంద్రను నకిలీ ఇళ్ల పట్టాల బాధిత మహిళలు కలిశారు. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేశారని మంత్రి ఆరోపించారు. పేదల ఇళ్లపట్టాల పేరుతో ఆటలాడిన ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికీ చట్టపరంగా తగిన గుణపాఠం చెబుతామని మంత్రి వెల్లడించారు. కాగా, 2024 ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక మచిలీపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
వార్తలు
నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేశారు: మంత్రి


