హైదరాబాద్: 28°C
వార్తలు

అజిత్ దోవల్ మాస్ వార్నింగ్

భారత్ సహనంగా ఉండే దేశమైనప్పటికీ, బలహీన దేశం మాత్రం కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. భారత్ సహనాన్ని బలహీనతగా భావించవద్దని తెలిపారు. భారత్ పెద్ద పెద్ద రిస్కులు కూడా తీసుకోగలదని.. అవసరాన్ని బట్టి గట్టి దెబ్బకొట్టగలదని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని పేర్కొన్నారు.